calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

09-04-2025 12:00:00 AM

  • రాజీవ్ యువ వికాసంతో నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత
  • 14వ తేదీ వరకు అవకాశం
  • కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8 (విజ యక్రాంతి): నిరుద్యోగ యువత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి సందర్శించి రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఆర్థిక చేయూత అందించి అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథ కాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, ఇతర ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన నిరుద్యోగ యువత మీ - సేవ కేంద్రాల ద్వా రా చేసుకున్న దరఖాస్తుల ప్రతులను సంబంధిత దరఖాస్తుదారుల నుండి తీసుకొని క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపా రు.

ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చాలని తెలిపారు. దరఖాస్తుతో పాటు జతపరచవలసిన పత్రాలు పరిశీలించాలని, ప్రజా పాలన సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వచ్చిన దరఖాస్తులను OBMMS పోర్టల్‌లో నమోదు ప్రక్రియను పరిశీలించి పథకం నిర్వహణపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల సహకార సంస్థ ఈ . డి. సజీవన్, మండల తహసీల్దార్ రోహిత్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, ఈ - డిస్టిక్ మేనేజర్ గౌతమ్ కుమార్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.