calender_icon.png 9 January, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

07-01-2025 12:27:47 AM

మహబూబ్ నగర్, జనవరి 6 ( విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని యన్‌టిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పిజి కళాశాలలో; 2024-25 విద్యా సంవత్సరానికి గాను పిజి కోర్సులో బోధించడానికి తెలుగు, జూవా లజీ, సబ్జెక్ట్స్, డిగ్రీ కోర్సు లో బోధించడానికి పొలిటికల్ సైన్స్ (ఉర్దూ మీడియం) సబ్జె క్టులలో అతిథి అధ్యాపకుల కొరకు అరులై న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ అమీనా ముంతాజ్ తెలిపారు.

అభ్యర్థులు పీజీలో (పోస్ట్ గ్రాడ్యు యేషన్) లో సంబంధిత సబ్జెక్టులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీ ర్ణత పొంది ఉండాలని, నెట్, స్లెట్, సెట్, పి హెడి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంద న్నారు. సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకునేవారు అన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 8వ తేదీ లోపు యన్‌టిఆర్ ప్రభుత్వ మహి ళా డిగ్రీ కళాశాల ఆఫిస్ మహబుబ్ నగర్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 9వ తేదీన ఉదయం 11:00 గంటలకు యన్‌టిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సి పాల్ అమీనా ముంతాజ్ సూచించారు.