calender_icon.png 9 April, 2025 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్విమ్మింగ్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

02-04-2025 12:00:00 AM

ఇల్లెందు, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): సిం గరేణి ఇల్లందు ఏరియా లో గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈత కొలను ఏప్రిల్ మొదటివారం లో ప్రారంభిస్తున్నామని ఇల్లందు ఏరియా జియం వి.కృ ష్ణయ్య తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అని, ఆరోగ్యంగా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి ఈత అనేది చాలా చక్కటి క్రీడ అని, చాలా మంది ఉద్యోగులు సరైన శారీరక శ్రమ లేనందున అనారోగ్య పాలవుతు న్నారన్నారు.

స్థానిక 24 ఏరియాలో ఉన్న ఆఫీసర్స్ క్లబ్ లోని స్విమ్మింగ్ పూల్ ను ఉపయోగించుకొనుటకు ఉత్సాహవంతులైన ఉ ద్యోగులకు, వారి పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొనుటకు ఆసక్తి గల ఉద్యోగస్తులు జి.యం కార్యాలయంలోని పర్సనల్ విభాగం నందు సంప్రదించగలరని తెలియజేశారు.