calender_icon.png 1 April, 2025 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

29-03-2025 01:15:24 AM

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్, మార్చి 28 (విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్ జిల్లాలోని వెనుకబడిన వర్గాల బీ.సీ, ఈ.బీ.సీ, (ఈ.డబ్ల్యూ.ఎస్), ఫెడరేషన్ లకు చెందిన నిరుద్యోగ యువతీ/ యువకులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.4 లక్షల వరకు రుణం పొందవచ్చన్నారు. 50 వేల రూపాయల లోపు విలువ చేసే యూనిట్ కు 100 శాతం సబ్సిడీ వర్తిస్తుందని, లక్ష రూపాయల లోపు యూనిట్ కు 90 శాతం సబ్సిడీ, 2 లక్షల యూనిట్ కు 80 శాతం సబ్సిడీ, 4 లక్షల వరకు విలువ చేసే యూనిట్ కు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు.

అభ్యర్థులు వ్యవసాయేతర పథకాలకు సంబంధించిన యూనిట్ల స్థాపనకై 21-55 ఏళ్ళ వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21-60 ఏళ్ళ వయసు కలిగి ఉండాలని అన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లయితే కుటుంబ వార్షిక ఆదాయము రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షల లోపు ఉన్న వారు అర్హులని, బ్యాంక్ సమ్మతి తప్పనిసరిగా ఉండాలన్నారు. దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, విధ్యార్హతలు, బ్యాంక్ ఖాతా ప్రతులను తప్పనిసరిగా జత చేయవలెనని అన్నారు. ఆసక్తి గల వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతీ, యువకులు  https://tgobmmsnew.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్లో 2025 ఏప్రిల్ 5వ తేదీ లోపు ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఆన్ లైన్లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను అర్జీదారు డౌన్ లోడ్ చేసుకొని, దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, విద్యార్హతలు, బ్యాంక్ ఖాతా ప్రతులను జత చేసి సంబంధిత మండల ఎంపిడిఓ లకు, మున్సిపల్ కార్యాలయములో అందజేయా లన్నారు. ఇట్టి అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వెనుకబడిన వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.