17-04-2025 12:00:00 AM
మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): జిల్లాలో రెండు నూతన బార్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కేజీ నందగోపాల్ కోరారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మంచిర్యా ల కార్పొరేషన్‌లో ఒక నూతన బార్‌కు, బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక కొత్త బార్ లైసెన్సుల మంజూరికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 2005 ఎక్సైజ్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్రవ్యాప్తం గా మూతపడిన 25 బార్‌లో స్థానంలో కొత్త బార్‌లకు అనుమతి ఇవ్వగా, జిల్లాలో రెండు బార్‌లకు అవకాశం కల్పించారు.
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 26 లోపు కలెక్టరేట్ లోని జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు రుసుముగా లక్ష రూపాయలు కాగా ఒక్కరు ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే అవకాశం ఉందన్నారు. 29న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు వ్బుసైట్ (https:// tgbcl.telangana.gov.in) లో సందర్శించవచ్చునని, మరిన్ని వివరాలకు 87126 58 773(జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి), 87126 58788 (మంచిర్యాల ఎక్సైజ్ సీఐ), 87126 58785 (బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ) నెంబర్లలో సంప్రదించవచ్చునన్నారు. ఆసక్తి గల వారు దరఖాస్తు ఫారం ఏ-1కు మూడు పాస్‌పోర్ట్ సైజ్‌ఫొటోలు, ఆధార్ లేదా పాన్‌కార్డు జిరాక్స్‌లను జతపరచాలని, దరఖాస్తు రుసుము రూ.1 లక్ష (నాన్ రిఫండ బుల్)తో డీడీ తీయాలని, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈ నెల 26న సాయంత్రం 5 గంటల్లోగా మంచిర్యాల లేక ఆదిలాబాద్ లేక హైదరాబాద్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని కోరారు.