calender_icon.png 3 April, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

02-04-2025 06:20:20 PM

మందమర్రి (విజయక్రాంతి): తెలుగు సంస్కృతి సాహిత్య సేవా ట్రస్ట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పురస్కరించుకొని వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారిని జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాచవరం గౌరీశంకర్, సభ్యులు బట్టు శ్రీనివాస్ రావులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో కృషిచేసిన వారికి జాతీయ నవ స్పూర్తి, నవ కీర్తి, మహానంది, స్వర్ణనంది, స్వర్ణ కంకణం, ఐరావతం, కామదేనువు, మయూరి, లైఫ్ టైం అచీవ్మెంట్, లెజెండరీ పురస్కారాలతో సత్కరించి, వారి సేవలను అభినందిస్తూ, వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.

అర్చకులు, జర్నలిస్టులు సామాజిక సేవకులు, ఆధ్యాత్మికం, రంజు వావిద్యం, సాహిత్యం, రచన, కవులు, కళాకారులు, సంగీతం, నృత్యం, భరతనాట్యం, కూచిపూడి, కోలాటం, చిత్రలేఖనం, శిల్పం, నాటకం, జానపదం, మిమిక్రీ, అవధానం, విద్య, వైద్యం, ఇంద్రజాలం, ముఖాభినయం, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, రంగస్థల కళాకారులు, జ్యోతిష్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాస్తు, యోగ, డోలక్ హార్మోనియం, భజన కళా సామాజిక సేవ, క్రీడలు, షార్ట్ ఫిలిం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణాభివృద్ధి, గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు ఈ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా పౌర ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ తో సత్కరించడం జరుగుతుందన్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25, 2025 తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గాన సభ మెన్ హాల్ లో మే 4, 2025న నిర్వహించు కార్యక్రమంలో ఎంపికైన వారిని జాతీయ పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9985275385, 7382592852 సెల్ నెంబర్లను సంప్రదించాలని కోరారు.