జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి జగదీశ్వర్‌రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 21: తెలంగాణ మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్ 2, 3, 9, 10వ తేదీల్లో నిర్వహించే గ్రూప్ సంబందించిన రెండు పుల్ లెగ్త్ మాక్ టెస్ట్‌లకు జిల్లాలోని మైనార్టీ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కే జగదీశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 29 చివరి తేదీ అని సూచించారు. మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంను నేరుగా లేదా 9247720650, 9492611057 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.