calender_icon.png 27 April, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 కొత్త బార్లకు 1,346 దరఖాస్తులు

27-04-2025 12:40:42 AM

  1. బెల్లింపల్లిలో ఒక్క బారుకు ఒకే దరఖాస్తు 

బెల్లంపల్లి మినహా మిగతా వాటికి ఈ నెల 29న డ్రా 

హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా 25 కొత్త బార్ల ఏర్పాటుకు 1,346 దరఖాస్తులు వచ్చాయి. బార్లకు వచ్చిన దరఖాస్తులను ఈ నెల 29న డ్రా తీసి, కేటాయించనున్నారు. గత నెల లో హైదరాబాద్ మినహా మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో 25 బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అదిలాబాద్‌లో మూడు కొత్త బా ర్లకు 61 దరఖాస్తులు వచ్చాయి. మంచిర్యాలలో  ఒక బారుకు 15,  కోరుట్లలో ఒక బారుకు 24, వరంగల్ అర్బన్‌లో 4 బార్లకు 491, ఖ మ్మంలో 2 బార్లకు 145, మిర్యాలగూడలో ఒక బారుకు 226, మహ బూబ్‌నగర్‌లో ఒక బారుకు 56, మహబూబ్‌నగర్‌లోని మక్తల్‌లో ఒక బారుకు 15,

అలంపూర్‌లో ఒక బారుకు 4, అచ్చంపేటలో 2 బార్లకు 18, మెదక్‌లో ఒక బారుకు 53, ఆర్మూర్‌లో ఒక బారుకు 8, కొడంగల్‌లో ఒక బారుకు 9, సరూర్ నగర్‌లోని మీర్‌పేట్‌లో ఒక బారుకు 200 దరఖాస్తులు వచ్చా యి. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలోని ఒక బారకు ఒకే దరఖాస్తు రావడంతో మే 5 వరకు మళ్లీ దరఖాస్తులు స్వీకరించనున్నారు.