26-03-2025 01:39:07 AM
మహబూబాబాద్ , మార్చి 25: (విజయ్ క్రాంతి ) వ్యవసాయ యాంత్రీకరణ ( సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మేకనైజేషన్ ) పథక ము ద్వారా 2024-25 సంవత్సరానికి గాను వివిధ వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో పొందుట కొరకు మహిళా రైతుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి భూక్య మహేందర్ మంగళవారం పత్రిక ప్రకటన లో తెలియజేశారు.
దరఖాస్తు చేసుకునే మహిళా రైతులు వ్యవసాయ భూమి యొక్క పట్టాదార్ పాస్ బుక్కు మరియు ట్రాక్టర్ పనిముట్ల కొరకు దరఖాస్తు చేసుకునేవారు ట్రాక్టర్ యొక్క రిజిస్ట్రేషన్ ధృవపత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ లతో సంబంధిత దరఖాస్తు ఫారం నింపి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని అన్నారు.మహిళా రైతులలో సన్న,చిన్న కారు రైతులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.
ఈ పథకంలో ఇనుగుర్తి మండలానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి 50 శాతం సబ్సిడీ తో వివిధ రకాల పది పనిముట్లు అందుబా టులో ఉన్నాయని తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది 27-03-2025. కావున ఈ లోపు దరఖాస్తులను సమర్పిం చాలని పూర్తి వివరాల కోసం మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని అన్నారు.