calender_icon.png 24 January, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పౌజ్ బదిలీల దరఖాస్తులు 52,235

13-07-2024 12:46:05 AM

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి) : 317జీవో, 46 జీవోలకు సంబంధించిన బదిలీలు కోరుతూ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు భారీ గా వచ్చాయి. క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీల కోసం 33 శాఖలకు సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 52,235 దరఖాస్తులు వచ్చినట్లు జీఏడీ అధికారు లు తెలిపారు. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ నుంచి 20,209 దరఖాస్తులు రాగా, లా, పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ విభాగం నుంచి ఒక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. హోమ్ శాఖ నుంచి 11,417, వైద్యారోగ్యశాఖ నుంచి 4,833, రెవెన్యూ నుంచి 2676, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ నుంచి 2390, సోషల్ వెల్ఫేర్ నుం చి 1797, ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్ విభాగం నుంచి 1235 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఇలా 33 విభాగాల నుంచి మొత్తం 52,235 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.