స్వీకరించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 680 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య అప్లికేషన్లు స్వీకరించారు. ఎస్సీ వెల్ఫేర్ శాఖకు సంబంధించి అధికంగా 215 దరఖాస్తులు వచ్చినట్టు పేర్కొన్నారు. విద్యుత్ శాఖ 98, రెవెన్యూ 94, మైనార్టీ వెల్ఫేర్ 90, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 64, ఇతర శాఖకు సంబంధించి 119 దరఖాస్తులు అందినట్టు పేర్కొన్నారు.