హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): హైదరాబాద్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 1637 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కదిరివన్ తెలిపారు. వాటిలో అత్యధికంగా 1,593 డబుల్ బెడ్‌రూమ్ కోసం దరఖాస్తులు ఉన్నట్లు కదిరవన్ తెలిపా రు.
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆయ న ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు రామకృష్ణ, జిల్లా అధికారులు ఆశన్న, రోహిణి, డాక్టర్ వెంకటి, ఇలియాజ్ అహ్మద్, రాజేందర్, శ్రీరామ్, రమేష్ పాల్గొన్నారు.