హైదరాబాద్,నవంబర్19(విజయ క్రాంతి) : ప్రజాభవన్‌లో మంగళవా రం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 614 అర్జీలు స్వీకరిం చినట్టు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ సంక్షేమశాఖకు సంబంధించి 210, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 112, విద్యుత్‌శాఖకు సంబంధించి 75, రెవెన్యూ సమస్యలకు సంబంధిం చి 65, హోం శాఖకు సంబంధించి 38, ప్రవాసీ ప్రజావాణికి సంబంధించి 2, ఇతర 112 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు.