హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 1,031 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖకు 580, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 172, విద్యుత్ శాఖ 81, ప్రవాసీ ప్రజావాణికి 2, ఇతర శాఖలకు 196 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.