10 తేదీనాటి ప్రజావాణి 11కు వాయిదా
హైదరాబాద్, సెప్టెంబర్ 6(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణిలో 570 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి 268, మైనార్టీ సంక్షేమ శాఖ 77, రెవెన్యూ 57, పంచాయతీరాజ్ 47, విద్యుత్ 28, ఇతర శాఖ లకు సంబంధించి 93 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ప్రజల నుంచి దరఖా స్తులు స్వీకరించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగా 16వ ఆర్థిక సంఘంతో ప్రజాభవన్‌లో ఈనెల 10న సమావేశం ఉండడంతో మంగళవారం నాటి ప్రజావాణిని 11వ తేదీ బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.