calender_icon.png 22 March, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యుల పోస్టులకు దరఖాస్తులు

21-03-2025 11:18:51 PM

గజ్వేల్: సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గజ్వేల్ ప్రభుత్వ జిల్లా దావకాన సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ(Gajwel Government Hospital Superintendent Dr.Annapurna) సూచించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎఎస్ గైనకాలజీ, సీఎఎస్ గ్డమో, నంగునూరు సీహెచ్సీలో సీఎఎస్ ఆర్థోపెటిక్(CAS Orthopedic), జిల్లా ఆసుపత్రిక గజ్వేల్లో  సీఎఎస్ జీడీఎంవో(CAS GDMO), చేర్యాల సిహెచ్సీలో  సీఎఎస్ జీడీఎంవో(CAS GDMO) పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయా పోస్టులకు అర్హత గల అభ్యర్థులు  ఈనెల 26వ తేదీలోగా  గజ్వేల్ జిల్లా ఆసుపత్రి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని సూపరిండెంట్  డాక్టర్  అన్నపూర్ణ తెలిపారు.