15-03-2025 12:46:43 AM
రేవల్లి: మార్చ్ 14: మండలంలోని ఆయా గ్రామాలలో గల 5 ఎకరాల లోపు భూమి గల రైతులు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వివిధ రకాలైన పంట తోటలకు దరఖాస్తు చేసుకోవాలని ఉపాధి హామీ మండల అధికారి నరసింహ ఒక ప్రకటనలో కోరారు, ఇందులో మామిడి,నిమ్మ,బత్తాయి, కొబ్బరి, ఆయిల్ ఫామ్, మునగ, డ్రాగన్ ఫ్రూట్, పండ్లతోటలకు ఆసక్తి గల రైతులు ఆయా గ్రామ పంచాయతీల కార్యాలయంలలో పంచాయతీ సెక్రెటరీ కి దరఖాస్తు సమర్పించాలని ఆయన కోరారు.