calender_icon.png 8 February, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

08-02-2025 12:31:26 AM

  1. మీసేవా కేంద్రాల్లో అందుబాటులోకి వెబ్ ఆప్షన్
  2. మీసేవా కమిషనర్‌కు సివిల్ సప్లయ్ కమిషనర్ లేఖ

హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా రేషన్‌కార్డుల కోసం, ఉన్న రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్పించేందుకు దరఖాస్తులను మీసేవా కేంద్రాల్లోనే సమర్పించేలా వెసులుబాటు కల్పించింది. గడిచిన పదేండ్లుగా కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఎంతోకాలంగా పెం డింగ్‌లో ఉన్న కొత్త రేషన్ కార్డుల జారీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పా టు చేసింది. ఏయే అర్హతలున్న వారికి కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలనే విషయమై చర్చించి, జన వరి 4న నిర్ణయం తీసుకున్నారు. కొత్తరేషన్ కార్డు లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకాలకు దరఖాస్తులు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని సూచించారు. ఈ నేపథ్యంలో మీసేవా కేంద్రాల్లోనూ కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులను స్వీకరించేలా వెబ్ ఆప్షన్‌ను ఏర్పాటు చేయాలని సివిల్ సప్లయ్ కమిషనర్ మీసేవా కమిషనర్‌ను కోరుతూ లేఖ రాశారు.

ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ రాష్ట్ర అధికారి చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులను ఆమోదించేలా రేషన్ కార్డుల డేటాబేస్ వెబ్ సేవలను పునరుద్ధరించాలని లేఖలో కోరారు. దీంతో ఇకపై కొత్త రేషన్‌కార్డుల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా నేరుగా మీసేవా కేంద్రాల్లోనే కావాల్సిన సర్టిఫికెట్లు, రికార్డులను జతచేసి దరఖాస్తు సమర్పించవచ్చు.