calender_icon.png 28 April, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటారం ప్రజావాణికి 9 దరఖాస్తులు

28-04-2025 06:01:52 PM

కాటారం (విజయక్రాంతి): ప్రతి సోమవారం తహసీల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించుకోవాలని తహసీల్దార్ నాగరాజు(Tahsildar Nagaraj) కోరారు. సోమవారం తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 9 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ దరఖాస్తులు అన్నియు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలుగా గుర్తించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు, మండల పంచాయతీ అధికారి వీరస్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.