కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల విద్యాసంస్థల్లో ఐదవ తరగతి ప్రవేశంతో పాటు ఆరు నుండి 9వ తరగతి వరకు గల బ్యాక్ లాగ్ ఖాళీలకు, గౌలిదొడ్డి, అలుగునూరు సిఓఈ లలో 9వ తరగతి, ఖమ్మం, పరిగి ఎస్ఓఈ లలో 8వ తరగతి, రుక్మాపూర్ సైనిక్ స్కూల్, మల్కాజిగిరి సైన్స్ అండ్ ఆర్ట్స్ స్కూళ్లలో ఆరో తరగతి ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులను ఈనెల 6 తేదీలోగా చేసుకోవాలని జోనల్ అధికారి అరుణకుమారి సోమవారం ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐదవ తరగతి, బ్యాక్ లాగ్ ఖాళీలకు సంబంధించి అడ్మిషన్ల కొరకు ఈనెల 23న ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబడుతుందని వివరించారు.