calender_icon.png 20 April, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్ అండ్ రెస్టారెంట్‌లకు దరఖాస్తులు

07-04-2025 12:33:31 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 6 ( విజయక్రాంతి ): నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో నూతనంగా రెండు బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు కోసం ఆసక్తిగల వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

లక్ష రూపాయల డిడి, మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, స్వీయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్, పాన్ కార్డు ఇతర పత్రాలు పొందుపరిచి ఫామ్1ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 26లోపు దరకాస్తూ చేసుకోవాలన్నారు. నాగర్ కర్నూల్ ఎక్సైజ్ కా ర్యాలయం, మహబూబ్నగర్, రాష్ట్ర ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారని దరఖాస్తు ఫారాలను అందించాలన్నారు.

ఈనెల 29న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చేతుల మీదుగా టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.