కరస్‌గుత్తి గురుకుల ప్రిన్సిపాల్
నాగల్‌గిద్ద, జనవ రి ౧౧ : 2025- - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురు కుల పాఠశాలల్లో చేపట్టే అడ్మిషన్లకు ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. కరస్ గుత్తి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఇంద్రజా ఒక ప్రకటనలో తెలిపారు.
గత నెల డిసెంబర్ 21 నుంచి దరఖాస్తుల స్వీక రణ ప్రారంభమైందని, ఇట్టి దరఖాస్తులకు వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ దరఖాస్తుల గడువు ముగుస్తుందని, రూ. 100 రుసు ము చెల్లించి ఫిబ్రవరి 2వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. ఫిబ్రవరి 23న గురుకుల ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
ఇంగ్లీష్, తెలుగు, గణితం సంబంధించి 100 మార్కుల ప్రశ్న పత్రం ఉంటుందన్నారు. విద్యావంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకో వాలని, అరులైన విద్యార్థులు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో దరఖాస్తులు చేసుకొని నాణ్య మైన విద్య బోధన పొందాలన్నారు.