జగిత్యాల అర్బన్, డిసెంబర్ 31: తెలంగాణ రాష్ర్ట వ్యాప్తంగా ప్రభుత్వం చేత నిర్వహింపబడుతున్న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిరావు ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 2024 25 సంవత్సరానికిగాను 5వ తరగతి నుండి 9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకో వాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాల యాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి పి.వెంకటేశ్వర్‌రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఉద్దేశించిన ప్రవేశపరీక్ష టిజిసెట్ - 2025కు ఆన్ లైన్లో ధరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.