calender_icon.png 2 January, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకోవచ్చు

30-12-2024 10:57:19 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సర్వే చేస్తున్న నేపథ్యంలో ఆన్లైన్లో పేర్లు లేని వారు ఆఫ్లైన్లో తిరిగి దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా స్థానిక సంస్థల ఆధునిక కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించగా అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్లో పేర్లు నమోదు చేయడం జరిగింది అన్నారు. కొన్ని తప్పిదాల వల్ల పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎంపీడీవో కార్యాలయంలో అన్ని వివరాలతో ఇల్లు లేని పేదలు దరఖాస్తు చేసుకోవచ్చని వాటిని ఆన్లైన్లో నమోదు చేసి తిరిగి సర్వే నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు.