28-03-2025 12:43:34 AM
గద్వాల:, మార్చి 27 (విజయక్రాంతి): జోగులాంబ గద్వాల జిల్లా నిరుద్యోగ క్రిస్టియన్ యువతకు వివిధ కోర్సులలో శిక్షణ ఇచ్చే గుర్తింపు పొందిన సంస్థల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనా రిటీల సంక్షేమ శాఖ అధికారి యం.పి. రమే ష్ బాబు గురువారం ప్రకటనలో తెలిపారు.
ట్రైనింగ్ ఎంప్లాయిమెట్ మరియు ప్లేస్మెంట్ ప్రోగ్రాం పథకంలో భాగంగా పదవ తరగతి మరియు ఆ పై తరగతులు చదివిన క్రిస్టియన్ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చుట కొరకు ఎన్‌ఎస్ డిసి, టాస్క్, ఇజిఎంఎం, మె ప్మా, ని ఎంఎస్‌ఎంఇ సంస్థల ద్వారా గుర్తిం పు పొందిన శిక్షణ భాగస్వాముల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 31 తేది వరకు మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, హైదరాబాద్ గారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరారు. ఇతర వివరాలకు 7013032567 ను సంప్రదించాల్సిందిగా తెలిపారు.