26-04-2025 12:40:30 AM
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ
కామారెడ్డి, ఏప్రిల్ 25,(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సరంపల్లి ఎక్స్ రోడ్ లో గల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన గురుకుల పురుషుల డిగ్రీ కళాశాలలో 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ , బీఏ, బీకాం ( సి ఏ ) బి జెడ్ సి, ఎంపీసీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి అడ్మిషన్లు జరుగుతున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కళాశాలలోని ప్రత్యేకత గురించి వివరించారు, ఎన్ ఏ ఎస్ సి బి గ్రేడ్, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్సిసి, డిజిటల్ క్లాస్ రూమ్, స్పోరట్స్, డిజిటల్ లైబ్రరీ, రెగ్యులర్ అధ్యాపకులచే విద్యా బోధన , ఉచిత వసతి ,రుచికరమైన భోజనం అందించబడుతుందన్నారు. మా కళాశాల పూర్వ విద్యార్థులు 49 మంది ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడ్డారనీ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు తీసుకొనబడును.
ఎస్సీ, బిసి, ఓసీ ప్రత్యేక కేటగిరీలలో కొన్ని సీట్లు మాత్రమే ఉండబడును అన్నారు. ముందుగా వచ్చే విద్యార్థులకు నేరుగా అడ్మిషన్లు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అన్నపూర్ణ గ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. 8500400635, 8309675651, 9299457541 ఫోన్ నెంబర్లను సంప్రదించాలన్నారు.