19-04-2025 11:56:22 PM
ఈ నెల 26 నుంచి 29 వరకు అర్హత పరీక్షలు
హైదరాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిర్వహించే జిల్లా, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు టెక్నికల్ అఫీషియల్స్ కమిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి కె. శ్రీమివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి 29 వరకు గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో అర్హత పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 21 నుంచి 35 వయస్సు లోపు ఉండాలని, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టోర్నమెంట్ బాధ్యతలు ఇచ్చినప్పుడు ఆరోజు ప్రకారం గౌరవ వేతనం ఉంటుందని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్ 22 తేదీ వరకు చివరి అవకాశమని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9848015443 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.