11-03-2025 06:37:07 PM
హైదరబాద్,(విజయక్రాంతి): గద్దర్ సినీ అవార్డుల విధివిధానాలు ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 13వ తేదీ నుంచి గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. 2014 నుంచి 2023 వరకు ఒక్కో ఏడాదికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ చలన చిత్ర అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వయం తీసుకుంది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు, ఎం. ప్రభాకర్ రెడ్డి పేర్లతో అవార్డులు కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫీచర్ ఫిల్స్, జాతీయ సమైకత చిత్రం విభాగంలో గద్దర్ అవార్డులు,
బాలల చలన చిత్రం విభాగంలో గద్దర్ పురస్కారాలు
పర్యావరణం, హెరిటేజ్, చరిత్రపై చిత్రాలకు గద్దర్ పురస్కారాలు
తొలి ఫీచర్ ఫిల్మ్, యామినేషన్ ఫిల్మ్ విభాగాల్లో గద్దర్ అవార్డులు
సోషల్ ఎఫెక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు
తెలుగు సినిమాలపై పుస్తకాలు, విశ్లేషణాత్మక వ్యాసాలకు గద్దర్ అవార్డులు
నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.