25-03-2025 12:28:41 AM
మంథని వ్యవసాయ సంచాలకులు అంజలి
మంథని మార్చి 24 (విజయ క్రాంతి) : ఆర్థిక సంవత్సరం 2024- 25 గాను స్మామ్ పథకం కింద వ్యవసాయ యాంత్రికరణకు మహిళా రైతులు దరఖాస్తు చేసుకోవాలని మంథని వ్యవసాయ సంచాలకులు ఎన్ అంజని ఒక సోమవారం ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ యాంత్రికరణ కింద బ్యాటరీ స్ప్రేయర్లు, చేతి పంపులు, సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్, పవర్ టిల్లర్, బ్రష్ కట్టర్, పవర్ విడర్ రోటవేటర్/కల్టివేటర్లు లు అందుబాటులో ఉన్నాయని, దీనికి సంబంధించి సమీప మండల వ్యవసాయ అధికారి దగ్గర దరఖాస్తు చేయాలని ఆమె తెలిపారు.