calender_icon.png 21 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత శిక్షణా తరగతుల దరఖాస్తుల గడువు పెంపు

21-01-2025 01:04:29 AM

గద్వాల, జనవరి 20 (విజయక్రాంతి ) : మైనారిటీ నిరుద్యోగ యువతకు వివిధ ఉద్యోగాల పరీక్షలపై ఉచిత శిక్షణా తరగతుల కోసం దరఖాస్తుల గడువును 15 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించి నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ అధికారి ఎం.పి. రమేష్ బాబు సో మవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ మైనారిటీస్ సంక్షేమ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఉచిత శిక్షణా తర గతులు గ్రూప్- 1, 2, 3, 4, ఆర్‌ఆర్బి ,ఎస్‌ఎస్సీ, బ్యాంకింగ్  తదితర పరీక్షలపై నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు అందించ బడతాయని  పేర్కొన్నారు.

ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు తమ సంబంధిత దవపత్రాలను జతచేసి దరఖాస్తులను 15 ఫిబ్రవరి 2025 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయం, రూమ్ నం. ఎఫ్-8, ఐడీఓసీ కాంప్లెక్స్, జోగుళాం బ గద్వాల వద్ద సమర్పించగలన్నారు.