calender_icon.png 10 January, 2025 | 9:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రికార్డుకు చేరువలో యాపిల్

25-12-2024 12:20:21 AM

న్యూయార్క్, డిసెంబర్ 24: ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్ కొత్త రికార్డును సృష్టించడానికి చేరువవుతున్నది. ప్రపంచంలో 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా రికార్డు సాధించడానికి కొద్ది దూరంలో ఉన్నది. మంగళవారం యూఎస్ మార్కెట్లో యాపిల్ షేరు కడపటి సమాచారం అందేసరికి 1 శాతం పెరిగి 257.77 డాలర్ల వద్దకు చేరింది. దీనితో కంపెనీ మార్కెట్ విలువ 3.89 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అందుకున్నది. ఈ స్థాయిని చేరుకున్న తొలి ప్రపంచ కంపెనీ ఇదే.

ఏఐ ఫీచర్లను జతచేసి విడుదల చేసిన ఐఫోన్ మోడల్స్ మార్కెట్‌ను ఆకట్టుకోవడంతో ఈ నెలలోనే యాపిల్ షేరు 17 శాతం, మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్ల మేర పుంజకున్నది. ఈ ఏడాది ఇప్పటివరకూ యాపిల్ 36 శాతం ఎగిసింది. విలువలో పెద్ద కంపెనీలైన ఎన్విడియా, మైక్రోసాఫ్ట్‌లను అధిగమించింది. ప్రస్తుతం ఏఐ చిప్ మేకర్ ఎన్విడియా మార్కెట్ విలువ 344 ట్రిలియన్ డాలర్లుకాగా, మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 326 ట్రిలియన్ డాలర్లు ఉన్నది.