12-02-2025 02:08:18 AM
కరీంనగర్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల కు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికల చరిత్రలో ఇంత పెద్ద ఎత్తు న నామినేషన్లు దాఖలు కాలేదు. పట్టభ ద్రుల నియోజకవర్గానికి 80 మంది నామినే షన్లు దాఖలు చేయగా ఉపాధ్యాయ నియో జకవర్గానికి 15 నామినేషన్లు దాఖలు కాగా స్క్రూటినీ ప్రక్రియ మంగళవారం సాయం త్రం వరకు కొనసాగింది.
సాంకేతిక సమస్య ల కారణంగా రాత్రి వరకు తిరస్కరణకు గురైన వారి పేర్లు ప్రకటించలేదు. ఉపసంహ రణ గడువు గురువారంతో ముగుస్తుంది. ఈసారి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నా మినేషన్లు దాఖలు చేయడంతో పలుకుబడి ఉండి ఓట్లు చీల్చే సత్తా ఉన్న వారిని విత్ డ్రా చేయించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటి నుండే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డి, బి ఎస్ పి నుండి ప్రసన్న హరికృష్ణ, గంగాధర్, యాదగిరి శేఖర్ రావు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి సర్దార్ రవీందర్ సింగ్, డాక్టర్ రాజ్ కుమార్ తోపాటు మరికొంతమంది ప్రధా నంగా పోటీలో ఉండనున్నారు. అయితే చాలామంది నామినేషన్లు దాఖలు చేయడం తో ఉపసంహరణ నాటికి బరిలో ఎంతమం ది ఉంటారన్నది తేలుతుంది.
ఎంతమంది ఉపసంహరించుకున్నా ఈసారి చాంతందం తా బ్యాలెట్ పేపర్ తప్పేట్లు లేదు. ఉపాధ్యా య నియోజకవర్గానికి వస్తే బీజేపీ నుండి మల్క కొమురయ్య, పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్ రెడ్డి, టీపీటీఎఫ్ నుంచి అశోక్ రెడ్డి, టీపీఎస్ నుంచి చిన్నారె డ్డిలు పోటీలో ఉండనున్నారు.
వివిధ ఉపా ధ్యాయ సంఘాల నుండి నామినేషన్ దాఖ లు చేసినవారికి తమకు మద్దతుగా ఉపసం హరించుకునేలా వీరు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉపాధ్యాయ నియోజకవర్గం నుం చి పీఆర్టీయూటీఎస్ నాయకుడు రఘోత్తం రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పీఆర్టీయూ సన్నద్ధం కాగా మిగతా వారు కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు.