calender_icon.png 16 January, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పీల్స్‌ను త్వరగా పరిష్కరించాలి

09-08-2024 12:30:53 AM

టీఎస్ యూటీఎఫ్ డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగిసి 40 రోజులు గడుస్తున్నా అప్పీల్స్‌ను పరిష్కరించకపోవ డాన్ని ఖండిస్తున్నామని టీఎస్ యూ టీఎఫ్ సంఘం నాయకులు తెలిపారు. సాంకేతిక కారణాలతో తప్పి దాలు జరిగి నష్టపోయిన ఉపాధ్యాయులకు మరోసారి అప్పీల్స్‌కు విద్యా శాఖ వారం రోజులు గడువు ఇచ్చిందని.. అయితే నేటికి నలభై రోజులు గడిచినా అవి పరిష్కారానికి నోచుకోలేదని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత స్టేషన్ (గతంలో పనిచేసిన స్కూల్)లో రిలీవై కొత్త స్టేషన్‌లో చేరకుండా కొందరు, రిలీవ్ కాకుండా కొందరు తమ అప్పీల్స్ పరిష్కారం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. టీచర్ల అప్పీల్స్‌ను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కోరారు. ఆది లాబాద్, మహబూబాబాద్ డీఈవో లు.. బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని, వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.