- ముగిసిన గడువు
- భారీగా తరలివచ్చిన కులసంఘాల ప్రతినిధులు
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): కులాల పేర్ల మార్పు, పర్యాయ పదాల చేర్పు కోసం బీసీ కమిషన్‌కు 500పైగా అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చాయి. కులాల పేర్ల మార్పుపై 15 రోజుల పాటు వినతులను స్వీకరించగా.. శనివారంతో ఆ గడువు ముగిసింది. ఈ సందర్భంగా బీసీ కుల సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున వచ్చిన తమ విజ్ఞప్తులను అఫిడవిట్ రూపంలో ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్ ఆఫీసులో సమర్పించారు.
బూంజువ అనే కులం విషయంలో జిల్లాల పరిమితులను ఎత్తివేయాలని, గొర్రెలు, మేకల పెంపకం కులవృత్తిగా ఉన్న ధన్‌ఘర్ అనే కులాన్ని బీసీల్లో చేర్చాలని, ఇలా పలు కులాలకు సంబంధించిన వినతులు భారీఎత్తున వచ్చాయి.
అఫిడవిట్లను క్షుణ్నంగా పరిశీలిం చిన తర్వాత కులాల సంస్కృతికి భంగం కలగకుం డా, ఎవరూ ఇబ్బంది పడకుండా పేర్లు మార్చాలని బీసీ కమిషన్ ఆలోచిస్తోంది. వినతులు స్వీకరించిన వారిలో బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, స్పెషల్ ఆఫీస్ సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.