అధికారులతో మాట్లాడతానని రైతులకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే...
జుక్కల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మార్కెట్ యార్డులో కొనుగోలు జరగకుండా నిలిచిపోయిన సోయా పంట రైతులు శుక్రవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలివెళ్లి ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు(MLA Tota Lakshmi Kantarao) సోయా పంట కొనుగోలు జరిపించాలని విన్నవించుకున్నారు. రైతుల విన్నపం మేరకు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి మిగిలిపోయిన రైతుల సోయా పంట కొనుగోలు కొరకు కృషి చేస్తానని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేకు కలిసి విన్నవించిన రైతులకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినందుకు సోయా పంట రైతులు హర్షం వ్యక్తం చేశారు.