19-04-2025 09:47:32 AM
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎవరి జీవితంలోనైనా పేదరిక.. ఎంతటి శ్రమనైనా ఓర్చుకునే శక్తినిస్తుంది... ఎంతటి దూరనైనా చేరుకొని కష్టపడి పేదరికం నుంచి బయటపడేలా అడుగులు వేద్దామని ఆలోచన తెస్తుంది. తన కుటుంబాన్ని పేదరికం నుంచి పాలద్రోచి చూసుకుందామని ఆలోచన నుంచే గల్ఫ్ దేశాలకు బయలుదేరి కటకటాల పాలై భారతదేశానికి వస్తే చాలు అంటూ వేడుకుంటున్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా వాసికి ఎదురైంది. ఈ ఆలోచనలో నుంచే మహబూబ్ నగర్ జిల్లా(Mahabubnagar District) హన్వాడ మండల పరిధిలోని పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు మ్యాతరి గోపాల్ గత కొన్ని నెల క్రితం గల్ఫ్ దేశానికి బయలుదేరాడు.
వెళ్లినప్పుడు బాగానే ఉంది అనుకున్న మ్యాచరి గోపాల్(Matchari Gopal) జీవితంలో ఇతరులకు చేసిన ఒక సహాయం వల్ల మరికొన్ని గంటల్లోనే తమ కుటుంబ సభ్యులను చూస్తాను అనుకుని ఎయిర్పోర్ట్ కు బయలుదేరిన మేటర్ గోపాల్కు అతను చేసిన సహాయం వల్లనే కటకటాల పాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దదర్పల్లి గ్రామానికి చెందిన మ్యాతరి గోపాల్ తండ్రి దస్తయ్య గత ఏడేళ్ల క్రితం మరణించారు. తల్లికి మతిస్థిమితం సరిగా లేదు. గోపాల్ అన్న మేతరి కృష్ణయ్య బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ బాధలను అన్నిటిని చూసిన మేదరి గోపాల్ తన కుటుంబాన్ని ఎలాగైనా ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో గల్ఫ్ దేశానికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే 2019 సంవత్సరంలో దుబాయ్ కి బయలుదేరారు.
చేసిన సహాయమే ఆ దేశం లో జైలు పాలు చేసింది..
దుబాయ్(Dubai) వెళ్లిన మ్యాతరి గోపాల్ అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ అవసరమైన డబ్బులు పంపిస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. మధ్యలో గోపాల్ సొంత ఊరు అయిన పెద్దదర్పల్లి గ్రామానికి వచ్చేసి 14 రోజులు ఉండి తిరిగి వెళ్లారు. 2024 సెప్టెంబర్ నెలలో తిరిగి స్వదేశమైన భారత్లోని తన ఇంటికి చేరుకుందామని షార్జా ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. ఎయిర్ పోర్ట్ లో గోపాల్ ఊహించని సంఘటన ఎదురైంది. ట్రావెల్ బాండ్ కేసులో గోపాల్ ఉన్నట్లు అక్కడి పోలీసులు అతని ప్రయాణాన్ని నిలిపివేశారు. నేనేం చేశానని వివరాలు తెలుసుకోగా గతంలో అతను ఐడి పై ఇతరులకు సిమ్ కార్డు ఇప్పిచ్చారని అతను చేసిన తప్పిదాల వల్ల ఇతని ఐడి తో ఉండడంతో గోపాల్ కు అక్కడి కరెన్సీ 9000 దినార్ (రూపాయలు) జరిమానా విధించారు.
అసలే బతుకుతెరువు కోసం బయటి దేశం పోయిన గోపాల్ దగ్గర అక్కడ కరెన్సీ తో కూడిన డబ్బులు అంత మొత్తం లేకపోవడంతో పోలీసులు మూడు నెలల పాటు గోపాల్ ను అక్కడ జైల్లో ఉంచారు. మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదల చేశారు. అతని పాస్పోర్ట్ హోల్డ్ లో ఉంచారు. పనిచేసిన కంపెనీ దగ్గరకు వెళ్లి ఎన్నో మార్లు ప్రాధేయపడిన వాళ్లు ఎలాంటి సహాయం చేయలేదు. ఎక్కడ పని లభించక రోజుకు ఎక్కడో ఒక దగ్గర ఒక పూట తిని కాలం గడుపుతున్నారు. నెలలు గడుస్తున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ దేశంలో అక్కడ ఇక్కడ ఒక్క పూట భోజనం కోసం త్రియే పరిస్థితి నెలకొంది. ఎలాగైనా తమ దేశానికి రావాలని చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించిన తమకు ఇక్కడ ఎవరు సహాయ సహకారాలు అందించడం లేదని కన్నీటి పర్వతమవుతూ ఆదేశం నుంచి ఓ వీడియోను వారి కుటుంబ సభ్యులకు పంపించి తమను ఎలాగైనా భారతదేశానికి తీసుకురావాలని గోపాల్ వేడుకుంటున్నాడు.
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారం అందించాలని వేడుకోలు
పొట్టకూటి కోసం పోరుగు దేశం పోయిన మ్యాతరి గోపాల్ తమ సొంతూరు కి తీసుకురావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy), సీఎం రేవంత్ రెడ్డి వీళ్లను వీడియో ద్వారా వేడుకుంటున్నారు. నా కొడుకు ఎప్పుడు వస్తారనే కంటికి పునుగు లేకుండా మతిస్థిమితం సరిగ్గా లేని గోపాల్ తల్లి తల్లి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా గోపాల్ ను సొంత గ్రామానికి రప్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబ పరిస్థితి తెలిసిన పెద్దదర్పల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.