13-02-2025 10:37:04 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని HWP(M) టీఎన్టీయూసీ నేతల బృందం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుని ఉద్యోగుల, భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కార్యాలయంలో కేంద్ర మంత్రిని కలసి ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు, భూ నిర్వాసితులకు సంబంధించిన సమస్యలపై ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈపి ఎఫ్ టు Gpf సమస్యలతో పాటు దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న భూ నిర్వాసితులను పర్మినెంట్ చేయాలనే పరిష్కరించాలని కోరారు.
పెన్షన్ విధానాంలో హెవీ వాటర్ ప్లాంట్ కార్మికులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాన్ని వివరించి GPFలో కొనసాగించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత మినిస్ట్రీ విభాగాలతో మాట్లాడి టీఎన్టియూసి బృందం సంబంధిత కేంద్ర మంత్రులను కలిసేందుకు పార్లమెంట్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ మేరకు గురువారం సంబంధిత శాఖల కేంద్ర మంత్రులను హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు, టీఎన్టియూసి బృందం కలసి సమస్యలను వివరించనున్నారు. కేంద్ర మంత్రిని కలిసిన బృందంలో తెలంగాణ స్టేట్ టీఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ వీరమాచినేని వెంకటరత్నాకర్, హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు, ఉడతనేని పుల్లారావు, డివి చారిలు ఉన్నారు.