calender_icon.png 7 February, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారి విస్తరణకు విజ్ఞప్తి

07-02-2025 02:10:05 AM

కేంద్రమంత్రి గడ్కరిని కలిసిన కేటీఆర్, ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నూతనంగా ప్రతిపాదించిన జాతీయ రహదారిని మరిం తగా విస్తరించాలని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మంత్రి గడ్కరిని కలిసి ప్రతిపాదిత నూతన హైవే పొడగింపుపై చర్చించినట్లు ఎమ్మెల్యే సంజయ్ వివరిం చారు.

కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్’కుమా ర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితర ప్రముఖులతో పాటూ కేంద్ర మంత్రి గడ్కరి ని కలిసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ప్రత్యేక విజ్ఞప్తి మేరకు జాతీయ రహదారి 368బి సూర్యాపేట నుండి సిరిసిల్ల వరకు ప్రతిపా దించగా, దానిని వేములవాడ నుండి కోరు ట్ల వరకు విస్తరించాలని కేంద్రమంత్రి గడ్కరీ ని  కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ విస్త రణ వల్ల నూతన జాతీయ రహదారి వెంబ డి ఉన్న తెలంగాణలోని ప్రముఖ దేవాల యాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి మరింత అనుసంధానం అవుతాయని కేంద్ర మంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు.

అలా గే నేషనల్ హైవే 63కి కూడా ఈ కొత్త హైవే అనుసంధానం అవుతుందని, దాంతో నూత న జాతీయ రహదారి రాకపోకలు మరింత గా మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చే శారు. కాగా ఈ ప్రతిపాదనలను మాజీ ము ఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే పంపినట్లు కో రుట్ల ఎమ్మెల్యే సంజయ్ వివరించారు.