హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి) : బీజేపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణకు అప్పిల్ కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ర్ట ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి నాయకత్వంలో మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలవత్, నాగపురి రాజమౌళి, శ్రీనివాస్‌రెడ్డితో కూడిన కమిటీని నియమించినట్లు వివరించారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో తలెత్తే వివాదాలను ఈ కమిటీ పరిష్కరిస్తుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.