24-02-2025 12:00:00 AM
కల్లూరు /ఫిబ్రవరి 23(విజయ క్రాంతి ): కల్లూరు మండలం లో 400 ఏళ్ళ నాటి అప్పయ్య స్వామిగా పిలవబడే శివుని గుడి మహాశివరాత్రికి సర్వంగా సుందరంగా ముస్తాబవుతోంది. పండుగను పురస్కరించు కొని గుడి నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
దాదాపు గా 400 సంవత్సరాల పురాతనమైన కల్లూరు పట్టణంలో రెండు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి అప్పయ్య స్వామి దేవాలయం. ఈ దేవాలయం ప్రతి సంవ త్సరం మహా శివరాత్రి పురస్కరించుకొని అనేక మంది భక్తులు, సందర్శకులను జాతర లతో ఆకర్షిస్తాయి.
రాణి రుద్రమ దేవి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, రాజు ప్రతాప రుద్ర శివాలయాన్ని నిర్మించారని చరిత్రక శాసనాలు తెలియ చేస్తున్నాయి. ఇక్కడ ప్రసిద్ధి శివలింగం కోరిన కోర్కెలు తీర్చే దైవం గా భక్తులు నమ్మకం .