calender_icon.png 26 December, 2024 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పా.. మీరు ప్రపంచంలోనే అరుదైన వజ్రం

08-11-2024 12:00:00 AM

ప్రతి అమ్మాయికి, ఆమె సెలబ్రిటీ అయినా సామాన్యురాలైనా తన తండ్రే మొదటి హీరో. గురువారం కమల్ హాసన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ శ్రుతి హాసన్ పోస్ట్ పెట్టారు. తండ్రితో నడుస్తూ వెళుతున్న ఫోటోను షేర్ చేసిన శ్రుతి హాసన్..

“అప్పా మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ప్రపంచంలో అరుదైన వజ్రం మీరు. మీ కుమార్తెగా జన్మించడం నా అదృష్టం. మీ పక్కన నడవటం నాకు చాలా ఇష్టమైన వాటిల్లో ఒకటి. మీరు దేవుడిని నమ్మరని నాకు తెలుసు కానీ మీపై ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.

మీరు సృష్టించే అద్భుతాలు చూడటం నాకు చాలా ఇష్టం. మీరిలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. మీ కలలన్నీ నిజమవ్వాలని కోరుకుంటున్నా” అని శ్రుతి హాసన్ పేర్కొన్నారు.