calender_icon.png 27 October, 2024 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు యాప్

27-10-2024 12:00:00 AM

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాం తి): రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపి క పారదర్శకంగా ఉంటుందని, రాజకీయ పార్టీలు, ప్రాంతాలు అనే బేధం లేకుండా అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు.

లబ్ధిదారుల ఎంపిక కోసం రూపొందించిన యాప్‌ను శనివారం సచివాలయం లోని తన కార్యాలయంలో మంత్రి పరిశీలించారు. ఈ యాప్‌లో ఒకటిరెండు మార్పుచే ర్పులను మంత్రి సూచించారు. ఆయన సూచనల ప్రకారం మార్పులు చేసి వచ్చే వారంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నా రు.

కొద్దిరోజుల్లోనే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభిస్తామని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు తుది దశకు చేరాయని మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని యాప్‌లో తెలుగు వర్షన్ ఉండేలా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు.

లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇందిరమ్మ ఇండ్లు పూర్తయ్యేవరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత ఎక్కువగా వాడుకోవాలన్నారు.ఇళ్లు లేని ప్రతీ పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు.