అయ్యప్ప మాలదరించి దర్గాను దర్శించి దీక్ష నియమాలను కించపరిచిన హీరో రామ్ చరణ్
హిందుత్వ వాది బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు
హుజురాబాద్ (విజయక్రాంతి): రామ్ చరణ్ అయ్యప్ప మాలతో కడపలో ఉన్న దర్గాను దర్శించి హిందూ ధర్మాన్ని అవమాన పరిచాడని హిందుత్వాది బిజెపి పట్టణ అధ్యక్షుడు గంగిశెట్టి రాజు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందులో కుట్ర దాగుందని డబ్బులకు అమ్ముడు పోయి ఇలాంటి హేయమైన చర్యలకు హీరో రామ్ చరణ్ పాల్పడుతున్నాడని ఆరోపించారు.
దీక్షా నియమం ప్రకారం అయ్యప్పమాల వేసుకున్న ఏ స్వామి అయినా సరే వారి సొంత కుటుంబ సభ్యులు చనిపోయిన దగ్గరికి గానీ లేక వారి సమాధుల దగ్గరికి మాల ధారణతో వెళ్లడం నిషేధం, అయ్యప్పకు మోకరిల్లి మాల విరమణ చేసి వెళ్ళాలి. ఇలాంటి హిందూ సాంప్రదాయాలను కాలరాసి హిందూ ధర్మాన్ని కించ పరిచే కుట్రలు జరుగుతున్నాయి. హిందూ ధర్మం ఆచారాల ప్రకారం ఎక్కడ గుళ్లోకి గానీ ఒక పుణ్య క్షేత్రాలకు వెళ్లేపుడు ఇలాంటి బొందల దగ్గరికి పోయే సంస్కృతి లేదు. అది పెద్ద అపచారం.. దీనికి రాంచరణ్ బేషరతుగా క్షమాపణ చెప్పి ముక్కు భూమికి రాయాలని హిందూత్వ వాదిగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇక నుండి హీరో రామ్ చరణ్ సినిమాలు ఒక్కటి కూడా చూడకుండా మేము బహిష్కరిస్తామని హెచ్చరించాడు.