17-03-2025 12:23:12 AM
నిజామాబాద్, మార్చ్ 16 (విజయ క్రాంతి): అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వాక్యాలను ఖండిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఆదివారం నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హంధాన్ నరాల రత్నాకర్ మహిళా కాంగ్రెస్ నాయకులు ఎన్ ఎస్ వి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో దళితులు గిరిజనులు మిమ్మల్ని మరింత పాతాళానికి తొక్కుతారని, వెంటనే స్పీకర్ గారిపై అనుచిత వాక్యాలు చేసిన జగదీష్ రెడ్డి దానిని సమర్థించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి అని డైమండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డీ రాజారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,మాజీ పీసీసీ కార్యదర్శి రం భూపాల్,మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఫిషెర్మన్ అధ్యక్షులు శ్రీనివాస్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్,లవంగ ప్రమోద్, అయ్యూబ్, అవీణ్, బింగి మాడు సుధన్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, విజయలక్ష్మి, అపర్ణ, జగడం సుమన్, ఆంతరెడ్డి విజయపౌల్ పాల్గొన్నారు.
మోర్తాడ్‌లో
మోర్తాడ్: స్పీకర్ స్థానాన్ని ఆగౌరపరిచిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి శాసన సభ సభ్యత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు ముత్యాల రాములు ఆధ్వర్యంలో కేటిఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధికార అధికార ప్రతి నిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లా డారు.
మండల పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్, ఎన్డీసీసీ డైరెక్టర్ మోతుకు భూమన్న, జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి, మండల యూత్ ప్రెసిడెంట్ మనోజ్ మండల ఇన్చార్జులు వై శ్రీ ,ఆనంద్, అనిల్, గంగా నరసయ్య, ఏఎంసీ డైరెక్టర్లు అబ్దుల్ నవీడ్, మహిపల్, లక్మా రంజిత్, కార్యకర్తలు నాగభూషణం, అర్గుల్ రమేష్, జిన్నా అరుణ్, పుప్పల రాజేష్, సిహెచ్ రవి, బాస మల్లికార్జున్, బబ్బురు నవీన్, జైడి చిన్న గంగారం, అవినాష్, వినోద్, కిజర్, రాజేష్, ఎండి అంజద్ పాల్గ్గొన్నారు.
కేటీఆర్, జగదీశ్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కేటీఆర్ , జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను స్థానిక గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ నాయకులు దహనం చేశారు. దళితులు అంటే బీఆర్‌ఎస్ కు చిన్న చూపు దళితులను అడుగడుగునా బీఆర్‌ఎస్ పార్టీ అవమాన పరుస్తుందని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ , కాంగ్రెస్ నాయకులు అబ్రబోయిన స్వామి ,సీతారాం మధు ,శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, రామస్వామి గౌడ్, నల్లపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, సాయిలు, రమేశ్, సంతోష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఈశ్వర్ గౌడ్ నరేష్ , కొండ అంజయ్య, షమీ, అబ్రబోయిన రాజేందర్ బాల్ రాజు, నాగారపు రాములు, నర్రాగుల లింగం మలేష్ యాదవ్, సుధాకర్, రాజయ్య, నయీమ్ , రామ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజేశ్వర్, మమ్మద్ హైమత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కామారెడ్డిలో
అసెంబ్లీలో దళిత స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్ రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పై, ఆయనకు మద్దతు తెలుపుతున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ ల శాసనసభ్యత్వాన్ని రద్దుచేసి చట్ట పరంగా వారిపై చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, జగదీష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పండ్ల రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగుల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనే శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు షేరు, అంజద్, ప్రసాద్ రవి, పంపరీ శ్రీనివాస్,
కాళ్ల గణేష్, నర్సింలు, మహేష్, నాయకులు, సబ్బని శంకర్, లక్కపతిని గంగాధర్, కిరణ్, రఫిక్, సిద్ధికి, మధు, అంతంపల్లి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్ గుప్త, కళ్లెం సత్యం, జగన్, సద్దాం, నర్సా గౌడ్, ఎజాస్ తదితరులు పాల్గొన్నారు.