న్యూఢిల్లీ, నవంబర్ 6: హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో 63 శాతం వృద్ధిచెంది రూ. 379 కోట్లకు చేరింది. నిరుడు క్యూ2తో పోలిస్తే బెడ్స్ ఆక్యుపెన్సీ 73 శాతం పెరిగిందని, దీంతో హెల్త్‌కేర్ సర్వీసుల
ఆదాయం 15 శాతం వృద్ధితో రూ. 5,589 కోట్లకు చేరినట్లు
అపోలో హాస్పిటల్స్ తెలిపింది. అపోలో 24/7 ప్లాట్‌ఫాబ్ ద్వారా ఆన్‌లైన్ కన్సల్టేషన్లు నిర్వహించే డిజిటల్ హెల్త్, ఫార్మసీ వెర్టికల్ రూ. 39.9 కోట్ల లాభాన్ని ఆర్జించిందని, దీంతో తమ ఆపరేటింగ్ మార్జిన్లు మెరుగయ్యాయని కంపెనీ వివరించింది. అపోలో హాస్పిటల్స్ ఇబిటా 30 శాతం ఎగిసి రూ. 816 కోట్లకు చేరింది.
* ‘ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో పలు మైలురాళ్లను చేరుకున్నాం. ఉత్తమ వైద్య సేవలు అందేలా చూడాలన్నదే మా భవిష్యత్తు లక్ష్యం. దీనిని వాస్తవం చేస్తామని వాగ్దానం చేస్తున్నాం’
ప్రతాప్ సి రెడ్డి చైర్మన్,
అపోలో హాస్పిటల్స్ గ్రూప్