హైదరాబాద్‌సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): నగరంలోని అపోలో మెడికల్ కాలేజీ స్నాతకోత్సవం జూబ్లీహిల్స్‌లోని ఆర్‌ఎన్‌ఆర్ ఆడిటోరియంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ(ఏఐజీ) చైర్మన్, పద్మశ్రీ డా.నాగేశ్వర్‌రెడ్డి హాజరై 2018బ్యాచ్‌కు చెందిన 100 మంది వైద్య విద్యార్థులకు పట్టాలను అందజేశారు. సిద్ధాంత్ బర్మేచా అనే విద్యార్థికి డా.ప్రతాప్ సీ రెడ్డి బంగారు పతకాన్ని అందజేశారు.
2012లో ప్రారంభమైన మెడికల్ కాలేజీలో ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు పట్టభద్రులయ్యారయ్యారని కాలేజీ యాజమాన్యం తెలిపింది. వీరిలో 90శాతం మంది విద్యార్థులు దేశంలోని వివిధ వైద్య కాలేజీలు, విదేశాల్లో పీజీ సీట్లు సాధించినట్లు తెలిపారు. 2017లో ఎంసీఐ నుంచి యూజీసీ గుర్తింపు పొందిన ఈ కాలేజీ 53సీట్లతో 18విభాగాల్లో పీజీ మెడికల్ కోర్సులను స్థాపించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు.
చిత్తూరులోని మెడికల్ కాలేజీ క్యాంపస్ తన 8వ బ్యాచ్‌లో 150మంది ఎంబీబీఎస్ విద్యార్థులను చేర్చుకుంది. అపోలో గ్రూప్ చిత్తూరులో నాలెడ్జ్‌హబ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చిత్తూరుతో పాటు దేశంలో ఉపాధి అవకాశాలు అందించనుంది. కార్యక్రమంలో అపోలో హాస్పటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సంగీతారరెడ్డి, డీన్ డా.కే.మనోహర్, ఏఐఎంఎస్‌ఆర్ సీఈవో అపర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.