calender_icon.png 12 January, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అట్టహాసంగా అపోలో కాన్వోకేషన్

04-12-2024 03:09:41 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 3 (విజయక్రాంతి): అపోలో మెడికల్ కాలేజీ కాన్వోకేషన్ కార్యక్రమాన్ని మంగళవారం జూబ్లీహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు (ఏఐజీ) హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెడిసిన్‌లో టాపర్‌గా నిలిచిన 2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్ విద్యార్థి డాక్టర్ దండు అవినాష్‌రెడ్డికి అపోలో మెడికల్ కాలేజీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ సంగీత రెడ్డి చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ ప్రదానం చేశారు.