సిద్దిపేట, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఏపీజీవీబీ బ్యాంక్ టీజీబీ రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏపీజీవీబీ సేవలు శనివారం నుంచి మూడురోజుల పాటు నిలిచిపోనున్నాయి. రికార్డులన్నీ టీజీబీలో విలీనం చేయడంలో భాగంగా సాఫ్ట్ట్‌వేర్ మార్చ పాటు టీజీబీ సేవలు అందించేందుకు కావాల్సిన ఆన్‌లైన్ సేవలను ఆప్‌డేట్ చేయనుండటంతో బ్యాంకు సేవలు పూర్తిగా స్తంభించనున్నాయి.
ఫోన్ పే, గూగుల్ పే, కస్టమర్ సర్వీస్ పా (సీఎస్‌పీ) సేవలు సైతం నిలిచిపోనున్నాయి. 2025 జనవరి 1 నుంచి టీజీబీ ద్వారా మళ్లీ సేవలు ప్రారంభం కానున్నాయి. బ్యాంకు పేరు మారుతున్నందున ఖాతాదారుల బ్యాంకు పాస్‌బుక్కు, ఏటీఎం కార్డులు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. ఇందుకోసం ఖాతాదా మూలు వారి బ్రాంచ్‌లను సంప్ర ఉంటుంది. అయితే బ్యాం విలీనం అయినప్పటికీ బ్యాంకు ఖాతా నంబర్ మాత్రం అదే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.