నీటి గుంతలో పడి వ్యక్తి మృతి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమాన్నూర్ గ్రామానికి చెందిన రాకేశ్ (20) శనివారం రాత్రి నిర్వహించిన గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నాడు. సమీపంలోని పిప్రి గ్రామ శివారులో ఉన్న స్టోన్ క్రషర్ వద్ద బండరాళ్ల కోసం తవిన గుంతలో పడి గల్లంతయ్యాడు. ఆదివారం పోలీసులు గజఈత గాళ్ల సాయంతో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.