calender_icon.png 13 February, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లాట్లను ఆక్రమించడమే కాకుండా ఎమ్మెల్యే పిఏ ను అంటూ బెదిరింపులు

12-02-2025 10:57:55 PM

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన..

ఇబ్రహీంపట్నం ఏసిపి రాజుకు ఫిర్యాదు చేసిన బాధ్యత కుటుంబ సభ్యులు..

ఇబ్రహీంపట్నం (విజయక్రాంతి): తన ప్లాట్లును ఆక్రమించమే కాకుండా ఓ ఎమ్మెల్యే పి.ఏ ని అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి నుండి రక్షణ కల్పించాలని ఓల్డ్ సిటీకి చెందిన నందికొండ ఆనంద్ బుధవారం ఇబ్రహీంపట్నం ఏసీపీని ఆశ్రయించారు. బాధిత కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలతో ఏసీపీని కలిసి తమ సమస్యను తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని తుర్కయంజాల్, బ్రాహ్మణపల్లి రోడ్డు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 279/2/3, 283, ప్లాట్ నెంబర్ 219. 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని తెలిపారు. ఖాళీగా ఉన్న తన ప్లాట్ పై మారగోని అంజయ్య అనే వ్యక్తి అక్రమంగా గత ఆరు నెలల క్రితం ప్రవేశించి గోడ నిర్మాణం చేస్తున్నాడు.

ఈ విషయంపై అతన్ని నిలదీయగా, నీచ పద్ధతిలో దుర్భాషలాడుతున్నడని, పెద్దమనుషులను తీసుకెళ్తే, నాకు నక్సలైట్లు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులంతా తెలుసు, ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పి.ఏ నీ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయాడు. అంతేకాకుండా ఎస్.సి సామాజిక వర్గానికి చెందిన అమాయకులను చేరదీసి కాపలదారులుగా నియమించుకుని వారితో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని భయభ్రాంతులకు గురిచేస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపారు. అనంతరం ఏసిపి స్పందిస్తూ ఆదిభట్ల సీ.ఐ తో మాట్లాడి అతని అక్రమాలపై దర్యాప్తు చేసి బాధితునికి న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బి.ఎ.స్పి రాష్ట్ర నాయకులు నందిగామ వెంకటేష్, బిజెపి రాష్ట్ర నాయకులు బోస్ పల్లి ప్రతాప్, చెన్నోజు శ్రీనివాసులు, నాంపల్లి మల్లేష్, మడుపు శివ తదితరులు పాల్గొన్నారు.